అక్షరటుడే, వెబ్‌డెస్క్:LIC | తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనుకుంటున్నారా? కేవలం నాలుగేళ్లలోనే రూ.కోటి ఆదాయం సమకూర్చాలనుకుంటున్నారా? అయితే, ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ(LIC) మీకోసం అద్భుతమైన స్కీమ్‌ను తీసుకొచ్చింది. బీమా పాలసీతో పాటు భవిష్యత్తుకు భరోసా మంచి పెట్టుబడి ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ‘జీవన్ శిరోమణి’(Jeevan Shiromani) స్కీమ్‌తో నాలుగేళ్లలోనే రూ.కోటి సంపాదించే అవకాశం కల్పించింది. మధ్య, ఉన్నత తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఎల్ఐసీ ఈ స్కీమ్(Scheme)ను ప్రవేశపెట్టింది.
LIC | ప్రయోజనాలెన్నో..
జీవన్ శిరోమణి పాలసీ(Jeevan Shiromani Policy) ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తోంది. బీమా కవరేజ్‌తో పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత మనీబ్యాక్(Money Back) లాభాలు పొందవచ్చు. అంతేకాదు, అవసరమైనప్పుడు ఈ పాలసీ మీద లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎల్ఐసీ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. పైగా అవసరమైన సమయంలో తిరిగి తీసుకునే అవకాశం ఉంది. కేవలం నాలుగు సంవత్సరాలపాటు మీరు ప్రీమియం(Premium) చెల్లిస్తే చాలు. ఇది హై-ఎండ్ పాలసీ(High-end Policy) కావడంతో ప్రీమియం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకి మీరు రూ. కోటి పొందాలంటే నెలకు రూ.94,000 చొప్పున చెల్లించాలి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నెల, మూడు, ఆరు నెలలతో పాటు ఏడాదికి కూడా ప్రీమియం చెల్లించుకునే అవకాశముంటుంది.
LIC | మనీబ్యాక్ అవకాశం
18 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకునే పాలసీ కాలానికి ఆధారంగా గరిష్ఠ వయస్సు పరిమితి ఉంటుంది. పాలసీ మధలో కొంత శాతం డబ్బు తిరిగి వస్తుంది. మీరు 14 ఏళ్ల పాలసీ కడితే 10, 12వ సంవత్సరాల్లో 30 శాతం డబ్బు తిరిగి వస్తుంది. 16 ఏళ్ల పాలసీ అయితే 12, 14వ సంవత్సరాల్లో 35 శాతం. 18 ఏళ్ల పాలసీలో 14, 16వ సంవత్సరాల్లో 40 శాతం, 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 16, 18వ సంవత్సరాల్లో 45 శాతం పాలసీ పూర్తి అయినప్పుడు, మిగిలిన డబ్బు బోనస్‌తో పాటు మొత్తం పొందవచ్చు. జీవన్ శిరోమణి పాలసీ(Jeevan Shiromani Policy) కట్టిన ఏడాది తర్వాత మీరు దీనిపై లోన్(Loan) కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీపై మీరు చెల్లించే ప్రీమియం మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని 80C కింద మినహాయింపు కూడా ఉంటుంది. పాలసీ పూర్తయ్యాక వచ్చే మొత్తంపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఈ పాలసీ తీసుకోవడానికి సంబంధిత వెబ్‌సైట్(Web Site)ను కానీ, దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్(Branch Office)ను కానీ లేదా తెలిసిన ఏజెంట్(Agent)ను కానీ సంప్రదించవచ్చు.