అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలో గంజాయి (Marijuana) విక్రయిస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ స్వప్న(Excise CI Swapna) ఆధ్వర్యంలో సారంగాపూర్ (Sarangapur) హెచ్పీ పెట్రోల్ పంపు (HP petrol pump) వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా సయ్యద్ వాసిం అనే వ్యక్తి ఆటోలో 100గ్రాముల ఎండు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు.గంజాయితో పాటు సెల్ఫోన్, ఆటోను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.
