HomeUncategorizedHero Vishal | పుట్టిన రోజు నాడు ప్రేయ‌సితో నిశ్చితార్థం.. ఇరు కుటుంబాల న‌డుమ జ‌రిగిన...

Hero Vishal | పుట్టిన రోజు నాడు ప్రేయ‌సితో నిశ్చితార్థం.. ఇరు కుటుంబాల న‌డుమ జ‌రిగిన వేడుక‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hero Vishal | కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తన పుట్టినరోజైన ఆగస్టు 29న అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. గతంలో పెళ్లికి దూరంగా ఉన్న ఆయన, తాజాగా తన ప్రియురాలు, నటి సాయి ధన్సిక(Actress Sai Dhansika)తో నిశ్చితార్థం చేసుకుని ఈ హ్యాపీ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు. చెన్నైలో ఇరు కుటుంబాల సమక్షంలో శుక్రవారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాల్(Hero Vishal) పుట్టినరోజున ఎంగేజ్‌మెంట్ జరగడం ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ లాంటిదే. 47 ఏళ్ల విశాల్ ఇప్పటి వరకు పెళ్లి గురించి ఏమాత్రం ఊసెత్తకపోవడంతో ఈ వార్త అభిమానుల్లో ఆనందం నింపింది.

Hero Vishal | గుడ్ న్యూస్..

కొద్ది నెలల క్రితం ధన్సికతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించిన విశాల్, ఆమెను ఆగస్టు 29న పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. అయితే నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం వల్ల వివాహాన్ని వాయిదా వేశారు. కానీ నిశ్చితార్థం(Engagement)తో అభిమానులకు మధురానుభూతిని అందించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన సాయి ధన్సిక 2006లో ‘మనతోడు మజైకాలం’ అనే తమిళ సినిమాతో మెరీనా అనే స్క్రీన్ నేమ్‌తో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2009లో ‘కెంప’ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ‘తనుషిక’ పేరుతో పరిచయం అయ్యారు. తర్వాత అన్ని భాషల్లోనూ సాయి ధన్సిక అనే పేరుతోనే కొనసాగారు.

2016లో రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా “కబాలి లో ఆయన కూతురిగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి సినిమాల్లో నటించారు. విశాల్-ధన్సిక నిశ్చితార్థ  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెడతారని, అధికారిక తేదీ త్వరలో ప్రకటించనున్నారు.