అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ(Rakhi Festival) ఈసారి ఆగస్టు 9న జరగనుంది. ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు అందుకుంటారు. ప్రతిగా సోదరులు తమ చెల్లెళ్లు, అక్కలకు ప్రేమతో బహుమతులు ఇస్తారు. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం.. కొన్ని వస్తువులను బహుమతి(Gift)గా ఇవ్వడం అశుభమని పెద్దలు చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Rakhi Festival | గాజుతో చేసిన వస్తువులు
గాజుతో తయారు చేసిన వస్తువులను (Rakhi Festival Day) బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. గాజు సున్నితమైనది, సులభంగా పగిలిపోయే స్వభావం కలది. ప్రేమతో ఇచ్చే బహుమతి పగిలిపోతే అది బంధానికి అశుభసూచికగా భావిస్తారు. ఇది సోదర సంబంధంలో సమస్యలు తలెత్తవచ్చనే సంకేతంగా పరిగణిస్తారు. కాబట్టి, గాజు వస్తువులకు(Glass Items) బదులుగా మన్నికైన ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం శ్రేయస్కరం.
Rakhi Festival | నలుపు రంగు వస్తువులు
హిందూ ధర్మం ప్రకారం నలుపు రంగు(Balck Colour)ను అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఈ రంగు శనిదేవునికి సంబంధించినదిగా పరిగణిస్తారు. శుభకార్యాల్లో ఈ రంగు దుస్తులు లేదా వస్తువులను వాడటానికి ఇష్టపడరు. రాఖీ పండుగ కూడా ఒక శుభప్రదమైన పర్వం కాబట్టి, నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వకపోవడం మంచిది. తమ సోదరీమణుల శుభాన్ని కోరుకునేవారు నలుపు రంగు కాకుండా ఇతర రంగుల వస్తువులను ఎంచుకోవడం ఉత్తమం.
Rakhi Festival | పర్‌ఫ్యూమ్‌లు
కొన్ని సార్లు బహుమతిగా పర్‌ఫ్యూమ్‌లు(Perfumes) ఇవ్వడం చూస్తుంటాం. అయితే, ఈ పవిత్రమైన పండుగ రోజున పర్‌ఫ్యూమ్‌లు ఇవ్వడం మంచిది కాదని కొందరు భావిస్తారు. ఎందుకంటే, పర్‌ఫ్యూమ్‌కు సంబంధించిన సువాసనలు అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే, వాటిలో కొన్ని రకాల రసాయనాలు చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ఒకవేళ పర్‌ఫ్యూమ్ ఇచ్చినా, అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. అందువల్ల, శాశ్వతమైన బంధానికి గుర్తుగా ఇలాంటి వస్తువులను ఇవ్వకపోవడం మంచిది.
Rakhi Festival | స్మార్ట్ వాచ్‌లు
ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్‌లు(Smart Watches) ఒక ట్రెండ్‌గా మారాయి. చాలా మంది తమ చెల్లెళ్లకు వాటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటారు. అయితే, శాస్త్రాల ప్రకారం, గడియారం సమయాన్ని సూచిస్తుంది. అది ఆగిపోతే బంధంపై ప్రభావం పడుతుందని ఒక వాదన ఉంది. స్మార్ట్ వాచ్‌లో కూడా బ్యాటరీ అయిపోవడం, పనిచేయడం ఆగిపోవడం లాంటివి జరగవచ్చు. అందువల్ల, ఇలాంటి గడియారాలను బహుమతిగా ఇవ్వడం కంటే, స్నేహానికి, బంధానికి చిహ్నంగా ఉండే ఇతర వస్తువులను ఎంచుకోవడం మంచిది.