అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Om Birla no-Confidence Motion | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు ఇచ్చాయి. లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీ (Congress MP)లు మహమ్మద్ జావెద్ కె.సురేశ్ నోటీసు అందజేశారు.
లోక్‌సభలో ఇటీవల రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ మేరకు ఆయనపై అవిశ్వాసం పెట్టాలని సోమవారమే నిర్ణయించాయి. తీర్మానం నోటీస్‌పై 118 మంది ఎంపీలు సంతకం చేశారు. రూల్ 94సీ కింద మంగళవారం నోటీసు ఇచ్చినట్లు ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు.
Om Birla no-confidence motion | వాయిదాల పర్వం
ప్రతిపక్ష సభ్యుల (Opposition Members) నిరసనలు, నినాదాలతో మంగళవారం సైతం సభ వాయిదా పడింది. సభ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసినట్లు సమాచారం. స్పీకర్ న్యాయమైన రీతిలో కార్యకలాపాలను నిర్వహించడం లేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అవిశ్వాస తీర్మానానికి సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సహా కీలక ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదు. లోక్‌సభ (Lok Sabha)లో ఈ నోటీసు అధికారికంగా ఆమోదం పొందిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీని స్పీకర్ మాట్లాడటానికి అనుమతించకపోతే, కాంగ్రెస్ (Congress) అవిశ్వాస తీర్మానంతో ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు మాట్లాడటానికి అనుమతిస్తే, ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం.మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకంపై రాహుల్ గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పుస్తకం ప్రచురితం కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటించడంపై ఆయన స్పందించారు. తన పుస్తకాన్ని కొనుగోలు చేయాలని నరవాణే 2023లో ట్వీట్ చేశారన్నారు. అమెజాన్‌లో ఆ పుస్తకం అందుబాటులో ఉందని చెప్పారు. తాను నరవాణే మాటలు నమ్ముతానని, పెంగ్విన్ మాటలు కాదన్నారు. నరవాణే తన పుస్తకంలో భారత ప్రభుత్వానికి (Government of India), ప్రధానమంత్రికి అసౌకర్యంగా ఉన్న కొన్ని ప్రకటనలు చేశారని తాను నమ్ముతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
1 comment
[…] : Om Birla decision | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస […]
Comments are closed.