ePaper
More
    Homeక్రీడలుOlympics Schedule | ఒలింపిక్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. 128 ఏళ్ల త‌ర్వాత క్రికెట్‌కి స్థానం

    Olympics Schedule | ఒలింపిక్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. 128 ఏళ్ల త‌ర్వాత క్రికెట్‌కి స్థానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Olympics Schedule | ఒలింపిక్స్ కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. 2028లో లాస్ ఏంజిల్స్‌(Los Angeles)లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడలకి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుద‌లైంది. మూడేళ్ల ముందే షెడ్యూల్​ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ విశ్వ‌క్రీడ‌ల‌లో ఈ సారి క్రికెట్‌కు ప్రత్యేక స్థానం లభించిన విషయం తెలిసిందే. ఈ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో T20 ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్రికెట్ పోటీలు 2028, జులై 12వ తేదీన ప్రారంభం కానున్నాయి. లాస్ ఏంజిల్స్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొమోనా నగరంలోని ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియం(Fairgrounds Stadium) ఈ మ్యాచ్‌లకు వేదిక కానుంది.

    Olympics Schedule | 128 ఏళ్ల త‌ర్వాత‌..

    జులై 12, 2028న మొదటి మ్యాచ్‌ ఆరంభం కానుంది. రెండు సెగ్మెంట్లలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనుండ‌గా, జులై 12 నుండి 18 వ‌ర‌కు తొలి సెగ్మెంట్, జులై 22 నుండి 28 వ‌ర‌కు రెండో సెగ్మెంట్ జ‌ర‌గ‌నుంది. జులై 20, 29వ తేదీల‌లో మెడ‌ల్ మ్యాచ్‌లు ఉంటాయ‌ని క‌మిటీ తెలిపింది. టీ20 త‌ర‌హాలో ఈ మ్యాచ్‌ల‌ని నిర్వ‌హించ‌నున్నారు. ఒక్కో జట్టులో 15 మంది సభ్యులు మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. జులై 14, 21 తేదీల‌లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌(Cricket Match)లు ఉండ‌వు అని తెలియ‌జేశారు. 1900లో ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత మ‌ళ్లీ ఇప్పుడు క్రికెట్‌కు అవ‌కాశం క‌ల్పించారు. అప్పట్లో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మాత్రమే క్రికెట్‌ ఆడగా, ఈసారి మాత్రం చాలా దేశాల మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌నుంది.

    ఈ ప్రకటనతో క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 2028లో క్రికెట్ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టోర్నీ(Tournament)లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో చెరో ఆరు జట్లు పోటీపడనున్నాయి. మొత్తంగా 180 మంది క్రికెటర్లు ఈ టోర్నీకి హాజరుకానున్నారు. ప్రతి జట్టులో 15 మంది సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. అయితే ఇన్ని రోజులు ఒలంపిక్స్‌లో క్రికెట్‌(Olympics Cricket)ని చేర్చ‌క‌పోవ‌డానికి కార‌ణం ఆ గేమ్‌కి ఆఫ్రికా, యూరప్ ఖండాల‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ లేక‌పోవ‌డ‌మే.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...