EPFO
EPFO | పీఎఫ్ చందాదారుల‌కు పాత‌ వ‌డ్డీ.. ఈపీఎఫ్ నిల్వ‌ల‌పై వ‌డ్డీ రేటు ఖ‌రారు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్‌)నిల్వ‌ల‌పై వ‌డ్డీ రేటును (interest rate) కేంద్ర ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను 8.25 శాతం వ‌డ్డీ చెల్లించేలా నోటిఫై చేసింది. ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) (Employees Provident Fund Organization) కేంద్ర బోర్డు ఆఫ్ ట్ర‌స్టీస్ ఇటీవ‌ల ప్ర‌తిపాదించిన వ‌డ్డీ రేటును కేంద్ర ప్ర‌భుత్వం (central government) య‌థాత‌థంగా ఆమోదం తెలిపింది. అంత‌కు ముందు సంవ‌త్స‌రం (2023-24) కూడా ఇదే వ‌డ్డీని చెల్లించింది. కేంద్రం తాజాగా ఇంటరెస్ట్ రేట్ నోటిఫై చేయ‌డంతో త్వ‌ర‌లో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వ‌డ్డీ జ‌మ చేయ‌నుంది.

EPFO | చెక్ చేసుకోవ‌డ‌మెలా?

కేంద్ర ప్ర‌భుత్వం (central government) త్వ‌ర‌లో వ‌డ్డీ చెల్లించ‌నుంది. ఈ నేప‌థ్యంలో చందాదారులు ఆ మొత్తం త‌మ ఖాతాల్లో జ‌మ అయిందో లేదో చెక్ చేసుకోవ‌డం చాలా సుల‌భం. మూడు, నాలుగు ర‌కాల ద్వారా పీఎఫ్ అకౌంట్ (PF account) చేసుకునే అవ‌కాశం అందుబాటులో ఉంది.

  • ఉమాంగ్ యాప్ (Umang app) ద్వారా పీఎఫ్ జ‌మ అయిందో లేదో స‌రిచూసుకోవ‌డంతో పాటు ఖాతాలో నిల్వ‌ల వివ‌రాలను చెక్ చేసుకోవ‌చ్చు. యాప్‌లో రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ తో లాగిన్ అయ్యాక ఈపీఎఫ్‌వో స‌ర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. అక్క‌డ యూఏఎన్ నెంబర్ ఎంట‌ర్ చేసి, మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి. ఆపై న‌గ‌దు నిల్వ‌లు, పాస్‌బుక్ (cash balances and passbook) వంటివి క‌నిపిస్తాయి.
  • ఈపీఎఫ్‌వో పోర్ట‌ల్ (www.epfindia.gov.in) ద్వారా కూడా పీఎఫ్ ఖాతాలోని న‌గ‌దు వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి యూఏఎన్ నెంబ‌ర్‌తో (UAN number) పాటు పాస్‌వ‌ర్డ్ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత మెంబ‌ర్ పాస్‌బుక్‌ను సెల‌క్ట్ చేసుకుంటే అన్ని వివ‌రాలు క‌నిపిస్తాయి.
  • మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా కూడా ఖాతాలోని న‌గ‌దు వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 99660 44425 నంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నంబ‌ర్‌కు కాల్ చేయ‌గానే ఆటోమెటిక్‌గా కాల్ డిస్‌క‌నెక్ట్ అవుతుంది. కాసేప‌టికే ఎస్సెమ్మెస్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఫోన్‌కు వ‌స్తుంది.
  • ఎస్సెమ్మెస్ రూపంలోనూ పీఎఫ్ అకౌంట్ వివ‌రాలు తెలుసుకునే సదుపాయం కూడా ఉంది. రిజిస్ట‌ర్డ్ మొబైల్ నుంచి EPFO UAN అని మెసేజ్ 77382 99899 నంబ‌ర్‌కు సెండ్ చేయాలి. ఆ కాసేప‌టికే ఫోన్‌కు పీఎఫ్ బ్యాలెన్స్ వ‌స్తుంది.