అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oil crisis in Pakistan : భారత వాయుసేన దాడులతో దాయాది దేశం పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం నెలకొంది. దీంతో ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంక్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత దళాలు దాడి చేయడంతో దాని ప్రభావం భారీగా పడింది.
ఇంధన కొరతతో పాటు దేశవ్యాప్తంగా సంక్షోభ భయం నెలకొంది. దీంతో పెట్రోల్ రేషన్ విధించి, పాక్ ప్రభుత్వం జనాలను అప్రమత్తం చేసింది. మరోవైపు భారత్ దాడులతో పాక్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది.
