HomeUncategorizedPawan Kalyan | ముంబైలో ఓజీ షూటింగ్.. మాస్ అప్పీల్‌తో అద‌ర‌గొట్టిన ప‌వ‌ర్ స్టార్

Pawan Kalyan | ముంబైలో ఓజీ షూటింగ్.. మాస్ అప్పీల్‌తో అద‌ర‌గొట్టిన ప‌వ‌ర్ స్టార్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pawan Kalyan | తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్‌స్టార్‌గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ Pawan kalyan ప్రస్తుతం ముంబై నగరంలో తన తాజా సినిమా షూటింగ్ ఓజీలో పాల్గొంటున్నారు. ప‌వర్ స్టార్ అభిమానులకు ఇది ఎంతో ఉత్సాహాన్నిచ్చే విష‌యం.ఓజీ సినిమా(OG movie) భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ముంబైలో ప్రముఖ ప్రదేశాల్లో, ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు, పాతబస్తీ గల్లీలు, మరియు కొన్ని స్టూడియోల్లో చిత్రీకరణ జరుగుతోంది. సుజీత్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది.

Pawan Kalyan | ప‌వ‌న్ లుక్ ఆకర్షణగా

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్మేషన్‌(Transformation)లోకి వెళ్లినట్లు సమాచారం. కొత్త లుక్‌తో పవన్ ముంబై వీధుల్లో కనిపించడంతో స్థానిక ప్రజలు, అభిమానులు ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కొంద‌రు ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్(Vintage Bell Bottom Pant) ధరించి సెక్యూరిటీ మ‌ధ్య కారు ఎక్కేందుకు వెళుతుండ‌గా, కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ మాస్ అప్పీల్ లుక్ అదిరింది అంటున్నారు. ప‌వ‌న్ కళ్యాణ్ రాజకీయాల్లో Politics క్రియాశీలకంగా ఉండగా, సినిమా కోసం ఇంత సమయం కేటాయించడం అభిమానుల్లో ఆనందాన్నిపెంచుతుంది.

ఓజీ OG సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆయన పాత్ర పక్కా మాస్ అపీలింగ్‌తో ఉండనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ. షూటింగ్(Shooting) వేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు. సెప్టెంబ‌ర్ 25, 2025 చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురానున్నారు. విజయదశమిని దృష్టిలో ఉంచుకొని సినిమా విడుదల తేదీని లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 8 రోజుల పాటు బాక్సాఫీస్ కలెక్షన్లకు ఆటంకం లేకుండా ఉండేలా రిలీజ్ డేట్ ను ఫైన్ చేశారని తెలుస్తోంది. దీంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో పయనించబోతుందని తెలుస్తోంది.