HomeUncategorizedPawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సుజిత్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..!

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సుజిత్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | ఏపీ రాజకీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan తాను ముందు క‌మిటైన సినిమాల‌ను పూర్తి చేయ‌లేక‌పోయాడు. ఇటీవ‌ల కాస్త స‌మ‌యం తీసుకొని ఒప్పుకున్న సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(Harihara Veeramallu) చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఈ మూవీ జూన్ 12న రిలీజ్ కానుంది. ఇక ప‌వ‌న్ క‌మిట్ అయిన మ‌రో చిత్రం ఓజీ. ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా తనదైన శైలిలో ఆడియెన్స్‌ను మెప్పించి స్టార్‌గా మారారు. ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను పెంచుకున్న పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ(OG) మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తీస్తున్నారు.

Pawan Kalyan | క్రేజీ అప్‌డేట్..

ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు పూనకాలు తెప్పించే సన్నివేశాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం ఓజీ సినిమాలో సుజిత్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్ (Fight scene) ను ప్లాన్ చేశాడట. ఈ ఫైట్ లో పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. ఇదే నిజమైతే మహేష్, పవన్ అభిమానులు థియేటర్స్ లో పూనకాలతో ఊగిపోతారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ న్యూస్ కూడా వైర‌ల్ గా మారింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఓజీ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 26న విడుద చేయనున‌న్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని అంటున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) సినిమా రెడీగా ఉంది. దీనిపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప్ర‌స్తుతానికి ఈ మూడు ప్రాజెక్ట్‌లు పూర్తి చేయ‌నున్న ప‌వ‌న్ త‌ర్వాత ఏదైనా సినిమాకి ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.

Must Read
Related News