- Advertisement -
Homeఫొటోలు & వీడియోలుOG Movie | "ఓజీ" సినిమాపై ఫుల్ హైప్స్ .. ఫ‌స్ట్ డే టిక్కెట్ల‌ని వేలం...

OG Movie | “ఓజీ” సినిమాపై ఫుల్ హైప్స్ .. ఫ‌స్ట్ డే టిక్కెట్ల‌ని వేలం వేస్తే అన్ని ల‌క్ష‌లొచ్చాయా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : OG Movie | పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ” విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా మీద ఉన్న క్రేజ్‌ను ఇప్పుడు అభిమానులు రాజకీయ మద్దతుగా మారుస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సినిమా ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని తమ అభిమాన నేత రాజకీయ పార్టీ జనసేనకు విరాళంగా అందించారు. ఓజీ సినిమా(OG Movie) టిక్కెట్లను వేలం వేయడం ద్వారా పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు లక్షల రూపాయల విరాళాలను సేకరించాయి. ఈ మొత్తం చెక్కుల రూపంలో జనసేన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు అందించారు.

- Advertisement -

OG Movie | కొత్త ప్ర‌య‌త్నం..

బెంగళూరు అభిమానులు ₹3.61 లక్షలు సేక‌రించ‌గా, చెన్నై అభిమానులు ₹1.72 లక్షలు, చిత్తూరు జిల్లా అభిమానులు ₹1 లక్ష రూపాయలు సంపాదించారు. వీటిని నాగబాబుకి అందించారు. అయితే ఈ విరాళాలను స్వీకరించిన నాగబాబు, అభిమానుల నిబద్ధతను ప్రశంసిస్తూ, “మీ ప్రేమే పవన్‌ కల్యాణ్‌కు నిజమైన శక్తి” అని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాలు అంటేనే అభిమానులకు పండుగ. అయితే ఈసారి సినిమా రిలీజ్‌ను ఒక ఉద్యమంలా మార్చారు. పబ్లిసిటీ, అభిమాన కార్యక్రమాలతో పాటు, పార్టీకి ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా తమ అభిమానాన్ని ప్రూవ్ చేస్తున్నారు.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పవన్‌ కల్యాణ్‌కు సినిమా రంగంలో ఉన్న భారీ ఫాలోయింగ్, ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద మద్దతుగా మారే అవకాశముందని చెప్పారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రాన్ని సుజీత్ తెర‌కెక్కించ‌గా, ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ క‌థానాయిక‌గా న‌టించింది. ఇమ్రాన్ హష్మీ విల‌న్‌గా న‌టించాడు. శ్రియా రెడ్డి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. DVV ఎంటర్టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2025న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పోస్టర్లకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News