అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానుల కోసం మోస్ట్ అవెయిటెడ్ మూవీ “ఓజీ (OG)” నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో ఉద్వేగాన్ని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి ఆదరణ దక్కించుకోగా, ఈ బర్త్‌డే గ్లింప్స్‌కి కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈసారి ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై కాకుండా, విలన్ క్యారెక్టర్‌గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) పైనే ఎక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది.
గ్లింప్స్ ప్రారంభమైన వెంటనే, ఇమ్రాన్ హష్మీ పలికిన డైలాగ్ – “డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురు చూస్తున్న.. మీ ఒమీ. హ్యాపీ బర్త్‌డే ఓజీ(Happy Birthday OG)అనేది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక చివర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న పవర్‌ఫుల్ షాట్‌కు ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్లింప్స్‌కు బలం చేకూర్చింది ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. చివరి 20 సెకండ్స్‌లో వినిపించిన ఇంగ్లీష్ ర్యాప్ టచ్‌తో అందరిని అలరించారు. సినిమాలోని పలు మాస్ షాట్స్‌ను ట్రైలర్ కోసం దాచిపెట్టారని సమాచారం. థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాలు తెలిపాయి.సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న “ఓజీ” సినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ లోకి చేరాయి. బర్త్‌డే గ్లింప్స్‌తో ఆ హైప్ మరింత పెరిగింది. త్వరలో మిగతా ప్రమోషనల్ కంటెంట్‌తో మేకర్స్ ఇంకా ఏం చూపిస్తారో చూడాలి.
ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం(Director Sujeeth) వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు.
2 comments
[…] పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘ఓజీ’ […]
[…] తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో పవన్ (Pawan Kalyan) రైతులతో మాట్లాడారు. ఉప్పు నీటితో […]
Comments are closed.