అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OG Movie | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్(Young Director Sujeeth) తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజీ”,సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే ఓజీ వరల్డ్‌వైడ్ ఓపెనింగ్స్ ద్వారా కొత్త రికార్డులను సెట్ చేస్తోంది.సినిమా విడుదలైన మొదటి రోజే ఓజీ సినిమా వరల్డ్‌వైడ్‌గా ₹154 కోట్ల(Rs.154 Crore) గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ చరిత్రలో మరో మైలురాయి సాధించింది.ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. ఈ రికార్డ్‌తో ఓజీ చిత్రం కూలీ( రూ.65 కోట్లు), ఛావా (రూ.31 కోట్లు), సైయారా(రూ.21.5 కోట్లు) సినిమాలని అధిగమించింది.
OG Movie | భారీ కలెక్షన్స్..
ఓజీ మూవీ (OG Movie) బడ్జెట్ & బిజినెస్ డీటెయిల్స్ చూస్తే.. మొత్తం బడ్జెట్: ₹250 కోట్లు కాగా, ప్రీ-రిలీజ్ బిజినెస్: ₹193.5 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹200 కోట్లు (డిస్ట్రిబ్యూషన్ షేర్), గ్రాస్ టార్గెట్: ₹400 కోట్లు. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ వసూళ్లు సాధించింది. నైజాం: ₹20.7 కోట్లు గ్రాస్ (డే 1 రికార్డ్!), ఉత్తరాంధ్ర: ₹6.70 కోట్లు, ఈస్ట్ గోదావరి: ₹5.30 కోట్లు, గుంటూరు: ₹6.35 కోట్లు, పెయిడ్ ప్రీమియర్స్: ₹20.25 కోట్లు షేర్‌తో పాటు 70 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్లు సమాచారం. మొత్తానికి ఓజీతో పవన్ కళ్యాణ్ అనేక రికార్డులు చెరిపేశాడు.
ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించి మెప్పించాడు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిచారు. సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్, మ్యూజిక్: ఎస్.ఎస్. థమన్, నిర్మాత: డీవీవీ దానయ్య (DVV Entertainment) సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. మూవీకి సెలవులు కలిసి రావడంతో ఈ చిత్రం మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా చెబుతున్నారు.