అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OG Movie | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో వసూళ్లలో దూసుకుపోతోంది. ఓవర్సీస్‌తో కలిపి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది.
గ్యాంగ్ స్టర్ క్రైం డ్రామా చిత్రం ‘ఓజీ’ (OG Movie) బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రభావాన్ని చూపింది. బుధవారం ప్రివ్యూ షోల ద్వారా రూ. 21 కోట్లు, ఆ తర్వాత తొలి రోజున రూ. 63.75 కోట్లు వసూలు చేసింది. సూపర్ స్టార్ పవన్ పల్యాణ్ సినిమాపై ఉన్న క్రేజ్ ఇంకా ఎక్కువగానే ఉంది. బాక్సాఫీస్ కలెక్షన్లు అందుకు నిదర్శనం. థియేటర్లలో విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. సుజీత్ దర్శకత్వం (Director Sujith) వహించిన ఈ సినిమాకు విడుదలైన రెండో రోజు మినహా తర్వాత భారీగా వసూళ్లు చేసింది.
వీకెండ్‌లో మంచి ఆదరణ లభించింది. శని, ఆదివారాల్లో రూ. 18.5 కోట్లు వసూలు చేసింది. సోమవారం రూ. 7.50 కోట్లు వసూలు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 147.70 కోట్లుగా ఉంది. సినిమా మొత్తం ఆక్యుపెన్సీ రేటు పరంగా, ఈ చిత్రం సోమవారం మొత్తం 18.34 శాతం తెలుగు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అత్యధిక ఆక్యుపెన్సీ రేటు రాత్రి షోలలో 21.83 శాతం, తరువాత సాయంత్రం షోలలో 19.24 శాతం, మధ్యాహ్నం 19.03 శాతం, ఉదయం షోలలో 13.24 శాతం నమోదైంది.
OG Movie | ప్రపంచవ్యాప్తంగా..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం (Pawan Kalyan) ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మైలురాయిని దాటింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో దీనిని సాధించిన తొలి చిత్రం ఇదే. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 227 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో దాని నికర కలెక్షన్ రూ. 140.2 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్ రూ. 58.95 కోట్లు. భారతదేశంలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ ఇప్పటివరకు రూ. 168.05 కోట్లు.