ePaper
More
    HomeజాతీయంSupreme Court | కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

    Supreme Court | కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేసి వేలం వేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం యోచించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హెచ్​సీయూ విద్యార్థులు (HCU Students) పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

    విపక్షాలు సైతం కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పట్టాయి. దీనిపై పలువురు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా.. అక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని ధర్మాసనం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు చేపట్టడం లేదని, పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని పేర్కొంది. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

    Supreme Court | ఆగస్టు 13కు విచారణ వాయిదా

    ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ పరిశీలనకు అమికస్‌ క్యూరీ సమయం కోరింది. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు కోర్టు తదుపరి విచారణ ఆగస్ట్‌ 13కు వాయిదా వేసింది.

    More like this

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...