అక్షరటుడే, కోటగిరి: Pothangal | పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్యపై ‘అక్షరటుడే’లో (Akshara Today) వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఉదయం నీళ్ల సమస్యపై కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం (MPDO office) ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఇదే సమస్యపై ‘అక్షరటుడే’లో కథనం ప్రచురించిగా జీపీ కార్యదర్శి (GP Secretary) స్పందించి సాయంత్రని కల్లా నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కాలనీవాసులు ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలిపారు.
