అక్షరటుడే, బోధన్ : Bodhan | వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నామని బిక్నెల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ మండలం (Bodhan Mandal) బిక్నెల్లి(Biknelli) గ్రామంలో రెండు బోరుమోటార్లు వారంరోజుల క్రితం చెడిపోయాయి. దీంతో తాగునీటికి గ్రామస్థులు అవస్థలు పడ్డారు. అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో విసిగిపోయిన గ్రామీణులు శనివారం బిక్నెల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పంచాయతీ కార్యదర్శిని ఘెరావ్ చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
