Homeజిల్లాలుకామారెడ్డిBanswada | డబుల్ బెడ్​రూం ఇళ్లకు తాళాలు వేసిన అధికారులు

Banswada | డబుల్ బెడ్​రూం ఇళ్లకు తాళాలు వేసిన అధికారులు

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని దేశాయిపేట గ్రామంలో (Desaipet village) డబుల్ బెడ్​రూం ఇళ్లకు గురువారం రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న ఆరుగురు లబ్ధిదారుల ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తామంతా ఇళ్లలోనే ఉంటున్నామని.. అధికారులకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను (government houses) ఇచ్చి మళ్లీ లాక్కోవడం ఎంతవరకు సమంజసమని కన్నీరు పెట్టుకున్నారు.

Banswada | బీజేపీ నాయకుల పరామర్శ

విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, గంగారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పేదలకు కేటాయించిన ఇళ్లను అధికారులు మళ్లీ లాక్కోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తక్షణమే అధికారులు లబ్ధిదారులకు తిరిగి ఇళ్లను అప్పగించాలని కోరారు.

Must Read
Related News