అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన తిమ్మాపూర్ (Timmapur) చెరువు కట్ట మరమ్మతు పనులను రేపటి నుంచి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ (Irrigation Department) డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సమస్యపై ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.
చెరువు మరమ్మత్తులు చేసుకున్న రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్ట పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.9 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. తక్షణ మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులకు పనులు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇసుక బస్తాలతో వరద ఉధృతిని తట్టుకునేలా కట్ట పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు.