అక్షరటుడే, బోధన్: Bodhan | నిబంధనలను పాటించని ట్రావెల్స్, స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు (RTA officials) కొరడా ఝలిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా బోధన్ పట్టణంలో (Bodhan town) ఎంవీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు చేశారు.
Bodhan | నిబంధనలు పాటించకపోతే..
నిబంధనలు పాటించని ఓ స్కూల్ బస్సుపై (school bus) కేసు నమోదు చేసినట్లు ఎంవీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రావెల్స్, స్కూల్ బస్సులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. లేకపోతే తనిఖీల్లో భాగంగా జరిమానాలు విధిస్తామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు టౌన్సీఐ వెంకట నారాయణ (Town CI Venkata Narayana) తనిఖీల్లో పాల్గొన్నారు.

