అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో పిస్తా హౌస్ (Pista House) రెస్టారెంట్లకు మంచి గిరాకీ ఉంటుంది. ప్రజలు పిస్తాహౌజ్‌కు లొట్టలేసుకుంటూ వెళ్లి బిర్యానీలు తింటారు. పెద్ద హోటల్ కావడంతో రేట్లు కూడా బాగానే ఉంటాయి. అయినా ఫుడ్ బాగుంటుందనే నమ్మకంతో ప్రజలు వెళ్తుంటారు. అయితే మంగళవారం పిస్తా హౌజ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officers) తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ నగరంలో మొత్తం 25 పిస్తా హౌజ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అని హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. 23 రెస్టారెంట్ల నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు. రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.
Hyderabad | అపరిశుభ్రంగా కిచెన్
పిస్తాహౌజ్ రెస్టారెంట్లలో కిచెన్ (Kitchen) పరిసరాల అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయి. నిర్వాహకులు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నారు.
Hyderabad | నిబంధనలు పాటించని హోటళ్లు
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా హోటళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే చాలా హోటళ్లలో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. కిచెన్‌లో కనీస శుభ్రత పాటించడం లేదు. పలు హోటళ్లలో కుళ్లిన నాన్‌వెజ్‌తో (Non Veg) వంటలు చేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు కస్టమర్లకు వడ్డిస్తున్నారు.