ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | ‘సాగర్’​పై పట్టింపేది..!

    Nizamsagar project | ‘సాగర్’​పై పట్టింపేది..!

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar project | ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్నా వరద గేట్లకు ఆయిలింగ్​, గ్రీసింగ్​ (oiling and greasing) చేపట్టలేదు. దీంతో భారీగా వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

    ప్రతి సంవత్సరం వర్షాకాలం (monsoon season) ప్రారంభానికి రెండు నెలల ముందే మరమ్మతులు చేపడతారు. నిజాంసాగర్​ వరద గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ చేయిస్తారు. అయితే ఈ సారి వర్షాలు ప్రారంభమైనా అధికారులు పనులు చేపట్టలేదు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో (Nizamsagar project) పాటు కల్యాణి, సింగితం రిజర్వాయర్ వరద గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనుల కోసం ప్రభుత్వం (Governament) రూ.8 లక్షలు మంజూరు చేసింది. కానీ ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రిస్క్‌తో కూడుకున్న పనులు కావడం, సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు సింగితం రిజర్వాయర్ (Singeetham reservoir) వరద గేట్లను ఎత్తే రాడ్ వంగిపోయింది. దానికి కూడా ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు.

    Nizamsagar project | మూడు సార్లు టెండర్లు పిలిచినా..

    నిజాంసాగర్ ప్రాజెక్టుకు (Nizamsagar Project) 20 వరద గేట్లు ఉన్నాయి. వీటి ఆయిలింగ్​, గ్రీసింగ్​ పనుల కోసం అధికారులు మూడు సార్లు టెండర్లు పిలిచారు. అయితే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు. ​ గేట్ల నిర్వహణ సక్రమంగా లేకుంటే.. ప్రాజెక్ట్​ నిండిన సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. భారీగా వరద వస్తే గేట్లు ఎత్తే సమయంలో మొరాయించే అవకాశం ఉంది. దీంతో ఆయకట్టు రైతులు, ప్రాజెక్ట్ పరీవాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్​ గేట్ల (project gates) నిర్వహణను సక్రమంగా చేపట్టాలని కోరుతున్నారు.

    Nizamsagar project | చర్యలు తీసుకుంటాం

    – సోలోమాన్, నీటిపారుదల శాఖ ఈఈ నిజాంసాగర్
    నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనుల కోసం మూడోసార్లు టెండర్లు పిలిచాం. కానీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వారం రోజుల్లో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...