Nizamabad City
Nizamabad City | అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగర శివారులోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలపై మున్సినల్​ కార్పొరేషన్​ అధికారులు చర్యలు తీసుకున్నారు. ధర్మపురి హిల్స్(Dharmapuri Hills), కోజా కాలనీలో(Koja Colony) గల ప్రభుత్వ స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆర్డీవో రాజేంద్ర కుమార్(RDO Rajendra Kumar) ఆదేశాలతో గురువారం పోలీస్​, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారుల సమక్షంలో వాటిని కూల్చివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వస్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.