Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | డబ్బులు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారు..

Nizamsagar | డబ్బులు ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారు..

- Advertisement -

అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు (Panchayiti officers) వేధింపులకు గురి చేస్తున్నారని నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్​కు (Gorugal) చెందిన శ్రీకాంత్​ రెడ్డి వాపోయారు. ఈమేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మండలకేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన మడిగెలను అద్దెకు తీసుకున్నానని, కానీ.. గిరాకీ లేకపోవడంతో దాదాపు రెండేళ్ల కిందట మడిగెలు ఖాళీ చేసినట్లు పేర్కొన్నాడు. అయితే, అడ్వాన్స్‌ రూపంలో చెల్లించిన రూ.42వేలను అడిగితే పంచాయతీ అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. ఎట్టకేలకు చెక్కు ఇచ్చినా.. ఖాతాలో డబ్బు లేదని బ్యాంకు అధికారులు తిప్పి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాడు.