Oscar Awards
Oscar Awards | ఆస్కార్ 2026 రేసులో భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీలు.. హిందీ నుంచి ‘హోమ్‌బౌండ్’, తెలుగు నుంచి 5 సినిమాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Oscar Awards | ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్‌ (ఆస్కార్) 2026కు భారత్‌ నుంచి పోటీ పడే సినిమాల జాబితాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Film Federation of India) తాజాగా ప్రకటించింది. ఈసారి కూడా బాలీవుడ్, టాలీవుడ్ నుంచి బలమైన పోటీ ఉండబోతోంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆశ్చర్యపరిచే ఎంట్రీలు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

Oscar Awards | హిందీ నుంచి అధికారిక ఎంపిక

బాలీవుడ్ దర్శకుడు నీరజ్ ఘైవాన్(Director Neeraj Ghaywan) తెరకెక్కించిన హిందీ చిత్రం హోమ్‌బౌండ్(Homebound) ఈసారి ఇండియా తరఫున ఆస్కార్‌ అవార్డుల బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ లో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. సామాజిక అంశాలను ఆవిష్కరిస్తూ గాఢమైన భావోద్వేగాలపై సాగే ఈ చిత్రం, ఇప్పటికే అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందింది. సినీ విశ్లేషకులు కూడా “ఈసారీ ఆస్కార్ గెలిచే అవకాశం ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ(Telugu Film Industry) నుంచి మొత్తం ఐదు సినిమాలు ఈసారి ఆస్కార్ రేసులోకి వెళ్ళబోతున్నాయి.పుష్ప 2 (సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్), సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేరా నిలిచాయి.ఈ లిస్టులో ‘పుష్ప 2’ మాత్రమే భారీ అంచనాలను సృష్టిస్తుండగా, మిగతా సినిమాలు ఎంపిక కావడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవదీస్తున్నారు. ముఖ్యంగా కన్నప్ప’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు జాబితాలో ఉండటంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో నిజంగా మంచి సినిమాలు దొరకలేదాఅంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.“పుష్ప 2 ఒక్కడే సరిపోతాడు. మిగతావన్నీ ఎందుకు పంపించారు?, కన్నప్పను ఆస్కార్‌(Oscar)కి పంపడం అంటే సరదా చేస్తున్నట్టే, బాలీవుడ్‌కి హోమ్‌బౌండ్ లాంటి క్లాస్ సినిమా, మనవైపు కమర్షియల్ జోక్ సినిమాలు అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఆస్కార్ నామినేషన్‌ వరకు చేరాయి. మదర్ ఇండియా (1957), సలామ్ బాంబే (1988), లగాన్ (2001) అయితే ఈ మూడు చిత్రాలు కూడా చివరికి అవార్డు సాధించలేకపోయాయి. అందువల్ల ఈసారి అయినా ‘హోమ్‌బౌండ్’ ఇండియాకు ఆస్కార్ గౌరవం తెస్తుందా? అనే ప్రశ్నతో సినీ ప్రియులు cine lovers ఎదురుచూస్తున్నారు.