BOB Jobs
BOB Jobs | బీవోబీలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అసిస్టెంట్‌ మేనేజర్‌(Asst. Manager), డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌తో సహా వివిధ విభాగాలలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య : 330
విద్యార్థత : పోస్టులను బట్టి డిగ్రీతోపాటు పీజీ పూర్తి చేసిన, పని అనుభవాన్ని కలిగినవారు అర్హులు.దరఖాస్తు గడువు : ఈనెల 19వ తేదీ వరకు
దరఖాస్తు రుసుము వివరాలు :
జనరల్‌(General), ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ. 850, గేట్‌వే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ. 175, గేట్‌వే చార్జీలు చెల్లించాలి.

BOB Jobs | దరఖాస్తు విధానం..

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bankofbaroda.in/లోకి వెళ్లాలి.
స్క్రీన్‌పై రైట్‌ సైడ్‌ టాప్‌లో కనిపించే కెరీర్స్‌పై క్లిక్‌ చేయండి. కరెంట్‌ అపార్చునిటీస్‌ ఎంచుకోండి.
దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్ట్‌ కోసం అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్‌ చేస్తే దరఖాస్తు వస్తుంది. అందులో పూర్తి వివరాలను నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
అన్ని వివరాలను నమోదు చేసిన తరువాత సబ్మిట్‌ బటన్‌ ప్రెస్‌ చేయండి. అప్లికేషన్‌ ఫాంను డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ తీసుకోండి.
పూర్తి వివరాలు, తాజా అప్‌డేట్స్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఎంపిక ప్రక్రియ :
అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.
వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా ఇతర అంచనా పద్ధతుల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. తుది మెరిట్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ స్కోర్‌లను, ముఖ్య పాత్రకు సంబంధించిన అనుకూలతను పరిగణనలోకి తీసుకుంటారు.

కాంట్రాక్ట్‌ వ్యవధి :
ఎంపికైన అభ్యర్థులను ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. గరిష్టంగా పదేళ్ల వరకు లేదా వారికి 60 ఏళ్లు నిండే వరకు..
ఎలా దరఖాస్తు చేయాలి.
పూర్తి వివరాలకు బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.bankofbaroda.in/ను సంప్రదించండి.