అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bribe | లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారి చేసిన వింత పనికి విజిలెన్స్ అధికారులు (Vigilance officers) షాక్ అయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్(Dehradun)కు చెందిన ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులను సంప్రదించాడు. తన సోదరుల కుల, నివాస ధ్రువపత్రాలు ఇవ్వడానికి రెవెన్యూ విభాగం పట్వారీ గుల్షన్ హైదర్ లంచం అడుగుతున్నాడనేది అతని ఫిర్యాదు. ఐడీ కార్డు, రూ.2 వేలు తీసుకొని మే 26న ఆఫీసుకు రమ్మని సదరు అధికారి చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కట్ చేస్తే.. మే 26న(సోమవారం) బాధితుడి నుంచి పట్వారీ గుల్షన్ హైదర్ రూ.2 వేల లంచం తీసుకుంటూ విజిలెన్స్ పోలీసులకు (Vigilance Police) పట్టుబడ్డాడు. వారిని చూసిన పట్వారీ వెంటనే నాలుగు రూ.500 నోట్లను నమిలి మింగేశాడు. విజిలెన్స్ అధికారులు అడ్డుకునేలోపే ఆ నోట్లన్నీ పట్వారీ పొట్టలోకి చేరిపోయాయి.
Bribe | సీటీ స్కాన్ చేయించాక షాక్
పట్వారీ గుల్షన్‌ను అదుపులోకి తీసుకొన్న విజిలెన్స్ అధికారులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital)కి తరలించారు. అక్కడ సీటీ స్కాన్ చేయించారు. కానీ, పొట్టలో కరెన్సీ నోట్ల ఆనవాళ్లు ఈ వైద్య పరీక్షలో వెల్లడి కాలేదు. దీంతో గుల్షన్‌కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించారు. కాగా, అల్ట్రాసౌండ్ స్కాన్ నివేదిక ఇంకా రావాల్సి ఉంది.
Bribe | 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద పట్వారీ గుల్షన్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. నిందితుడిని మే 27న కోర్టు ఎదుట హాజరుపర్చి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం డెహ్రాడూన్ జైలు(Dehradun Jail)కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు, విజిలెన్స్ అధికారులు కలిసి పట్వారీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.