Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor | వాసవీమాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ

Bhiknoor | వాసవీమాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ

భిక్కనూరు మండల కేంద్రంలో వాసమిమాత ఆలయంలో అమ్మవారికి మంగళవారం ఒడిబియ్యం పోశారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | మండల కేంద్రంలోని వాసవీమాత ఆలయంలో (Vasavi Mata Temple) బుధవారం భిక్కనూరు ఆర్యవైశ్య మహిళా కిట్టి ఆధ్వర్యంలో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాసవీమాతకు ఒడిబియ్యం పోసి.. కట్నకానుకలను సమర్పించారు.

Bhiknoor | సామూహిక సత్యనారాయణ వ్రతాలు..

కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు (Satyanarayana Swamy Vratam) నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. ఆ తర్వాత కార్తీక భోజనాల కార్యక్రమం నిర్వహించారు.