అక్షరటుడే, వెబ్‌డెస్క్:Odisha | ఈ రోజుల్లో మహిళలకి భద్రత లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపుల (Sexual harassment) బారిన పడుతున్నారు. ఇవి సమాజంలో రోజూ రోజుకి పెరగుతూ పోతున్నాయి. అయితే 60ఏళ్ల వృద్దుడు కూడా లైంగిక వేధింపులకి పాల్పడుతుండడం అందరిని ఆశ్చర్యపరిచంది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆగ్రహంతో మహిళలంతా ఏకమై ఒక వృద్ధుడిని హతమార్చారు. అనంతరం ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి కాల్చివేశారు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లా(Gajapati District)లో జరగగా, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Odisha | పక్కా స్కెచ్‌తో..
అయితే వృద్ధుడిని చంపిన కేసుకి సంబంధించి మొత్తం పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మరణించిన వ్యక్తి వయసు 60 సంవత్సరాలు కాగా, అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి గ్రామంలోని పలువురు మహిళల Womens పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి 52 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే నిందితుడి ఆగడాలు రోజురోజుకూ శృతి మించడంతో భరించలేని ఆరుగురు బాధితురాళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ రాత్రి వారంతా సమావేశమై అతడిని అంతమొందించాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న ఆ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. ఈ దారుణానికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా సహకరించినట్టు తేలింది. హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి, అక్కడ దహనం చేశారు. సదరు వ్యక్తి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టి హత్యలో పాలుపంచుకున్న ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు Police అరెస్టు చేశారు. మృతుడు తమను నిరంతరం లైంగికంగా వేధించడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరుగురు మహిళలు చెప్పుకొచ్చారు. అయితే మృతుడిపై లైంగిక వేధింపుల విషయంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు(Police) అంటున్నారు.