Homeఆంధప్రదేశ్Odisha Bus Fire Accident | మరో బస్సు ప్రమాదం.. రన్నింగ్​లో ఉండగానే వ్యాపించిన మంటలు..!

Odisha Bus Fire Accident | మరో బస్సు ప్రమాదం.. రన్నింగ్​లో ఉండగానే వ్యాపించిన మంటలు..!

Odisha Bus Fire Accident | ఆంధ్రప్రదేశ్​లో బస్సు ప్రమాదం సంభవించింది. ఆంధ్ర—ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. 

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Odisha Bus Fire Accident | వరుస బస్సు ప్రమాదాలు (bus accident) తెలుగు రాష్ట్రాల (Telugu states) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కర్నూల్​ ట్రావెల్స్​ బస్సు ప్రమాదం (Kurnool Travels bus fire accident) లో 21 మంది సజీవ దహనం.. రంగారెడ్డి Rangareddy జిల్లా చేవెళ్లలో కంకరలో కూరుకుపోయి 19 మంది ప్రయాణికుల సమాధి మరువక ముందే.. మరో ఘటన చోటుచేసుకుంది.

Odisha Bus Fire Accident |

ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లో బస్సు ప్రమాదం సంభవించింది. ఆంధ్ర—ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డు (Andhra-Odisha border ghat road) లో ఈ ఘటన జరిగింది.

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రన్నింగ్​లో ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విశాఖపట్నం నుంచి జైపూర్ (ఒడిశా) (Visakhapatnam to Jaipur – Odisha) వెళ్తుండగా.. మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవరు సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేశారు.

వెంటనే ప్రయాణికులను కిందికి దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు అగ్నిమాపక దళం ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సకాలంలో చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.