Homeటెక్నాలజీDiwali Offer | దీపావళి సీజన్‌కు ముందే స్మార్ట్‌ఫోన్ హంగామా.. ఈ నెల‌లో ఫోన్స్‌పై బంప‌ర్...

Diwali Offer | దీపావళి సీజన్‌కు ముందే స్మార్ట్‌ఫోన్ హంగామా.. ఈ నెల‌లో ఫోన్స్‌పై బంప‌ర్ ఆఫ‌ర్స్

Diwali Offer | ఈ అక్టోబర్ నెలలో అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా iQOO 15, OnePlus 15, Vivo X300 Pro, Xiaomi 17, Realme 15 Pro 5G లాంటి ఫోన్‌లు రాబోతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Diwali Offer | దీపావ‌ళి పండుగ‌కు (Diwali Festival) ముందే, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు వినియోగదారుల కోసం కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ బ్రాండ్లు అయిన OnePlus, iQOO, Vivo, Xiaomi, Realme లాంటి సంస్థలు ఈ నెలలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. ముఖ్యంగా, ఈ ఫోన్లు శక్తివంతమైన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌, భారీ 7,000mAh బ్యాటరీ, అధునాతన AI టెక్నాలజీ, ప్రొఫెషనల్ కెమెరాల ఫీచర్లతో ఉంటాయని తెలుస్తోంది.

Diwali Offer | వన్​ ప్లస్​ 15

  • OnePlus కంపెనీ ఈ నెలలో OnePlus 15 ను గ్లోబల్‌గా లాంచ్ చేయబోతోంది.
  • ప్రాసెసర్ : Snapdragon 8 Elite Gen 5
  • RAM/Storage : 12GB RAM + 256GB
  • డిస్‌ప్లే : 6.78 అంగుళాల LTPO OLED (165Hz రిఫ్రెష్ రేట్)
  • కెమెరా : 50MP ట్రిపుల్ రియర్ కెమెరా
  • బ్యాటరీ : 7,000mAh, 120W ఫాస్ట్ ఛార్జింగ్

iQOO 15

  • గేమింగ్, హై పర్ఫార్మెన్స్‌ కోసం iQOO 15 ప్రత్యేకంగా రూపొందించబడింది.
  • డిస్‌ప్లే : 6.8 అంగుళాల 2K LTPO AMOLED (144Hz రిఫ్రెష్ రేట్)
  • చిప్‌సెట్ : Snapdragon 8 Elite Gen 5

RAM: 12GB

బ్యాటరీ : 7,000mAh

ఫీచర్ : RGB లైటింగ్ డిజైన్ – గేమర్‌లకు ప్రత్యేక ఆకర్షణ

Vivo X300 Pro

  • ఫోటోగ్రఫీ ప్రేమికులకు Vivo నుంచి అదిరిపోయే ఫోన్.
  • లాంచ్ డేట్ : అక్టోబర్ 13
  • డిస్‌ప్లే : 6.31 అంగుళాలు
  • ప్రాసెసర్ : MediaTek Dimensity 9500
  • RAM : 12GB
  • కెమెరా : 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
  • ఫోటోగ్రఫీ : ప్రొఫెషనల్-గ్రేడ్

Xiaomi 17

  • చైనాలో ఇప్పటికే విడుదలైన Xiaomi 17, ఇప్పుడు భారతదేశంలోకి అడుగుపెట్టబోతోంది.
  • ప్రాసెసర్ : Snapdragon 8 Elite Gen 5
  • డిస్‌ప్లే : 6.3 అంగుళాల OLED
  • బ్యాటరీ : 7,000mAh
  • ఫీచర్ : AI ఇంజిన్‌తో కూడిన శక్తివంతమైన పనితీరు

Realme 15 Pro 5G – Game of Thrones Edition

  • వినూత్న డిజైన్, గేమింగ్‌కి అనుకూలంగా రూపొందించిన రియల్‌మీ ఫోన్.
  • డిస్‌ప్లే : 6.8 అంగుళాల AMOLED
  • ప్రాసెసర్ : Snapdragon 7 Gen 4
  • కెమెరా : డ్యూయల్ 50MP
  • బ్యాటరీ : 7,000mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్
  • వాటర్ రెసిస్టెన్స్ : IP66, IP68, IP69 రేటింగ్‌లు

మొత్తం మీద… ఈ అక్టోబర్ నెలలో పూర్తిగా హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల(Smart Phones) హంగామా ఉండ‌నుంది. దీపావళికి ముందుగా వినియోగదారులకు ఎన్నో ఆప్షన్లు లభించనున్నాయి. కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ పరంగా ఈ ఫోన్లు మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే అవకాశముంది. సాంకేతిక ప్రేమికులు, ఫోటోగ్రఫీ, గేమింగ్ అభిమానులు మీకు సరిపోయే ఫోన్ ఈ జాబితాలో ఉంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొనుగోలు చేయ‌వ‌చ్చు.