అక్షరటుడే, న్యూఢిల్లీ: October Month New Rules | ప్రతి నెల మొదటి రోజు కొన్ని కొత్త నిబంధనలు, ధరల మార్పులు అమలులోకి వస్తుంటాయి. ఈసారి అక్టోబరు 1, 2025 నుంచి పలు రంగాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు, ఆన్‌లైన్ గేమింగ్, రైల్వే టికెట్ బుకింగ్, బ్యాంకింగ్, UPI చెల్లింపులు, పెన్షన్ ప్లాన్‌ల వంటి విభాగాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
October Month New Rules | మార్పులు ఇవే..
ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం
అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ online gaming రంగంపై కట్టడి విధిస్తూ ప్రభుత్వం కొత్త బిల్లును అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా డబ్బుతో ఆడే గేమ్స్ అన్నింటిని బ్యాన్ చేసింది. మోసాల నివారణకు, వినియోగదారుల భద్రత కోసమే ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.
రైలు టికెట్ బుకింగ్‌లో ఆధార్ తప్పనిసరి
రైల్వే శాఖ టికెట్ బుకింగ్‌కు Ticket Booking కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అక్టోబరు 1 నుంచి బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ Aadhaar వెరిఫికేషన్ తప్పనిసరి. ఇది టికెట్‌ల దుర్వినియోగాన్ని నివారించడానికే తీసుకున్న చర్యగా పేర్కొంది.
బ్యాంకింగ్ Banking రంగంలో మార్పులు
వడ్డీ రేట్లు, రుణాల ఖర్చులు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఇచ్చే వడ్డీ, పొదుపు పథకాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచగా, మరికొన్ని తగ్గించాయి. పెట్టుబడిదారులు తమ ప్లాన్లను ఈ మార్పుల ప్రకారం మళ్ళీ పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
UPI చెల్లింపుల కొత్త విధానం
UPI పేమెంట్స్‌లో పీర్ టు పీర్ (P2P) ట్రాన్సాక్షన్లపై పరిమితులు విధించారు. యూపీఐ ఐడీ ద్వారా నేరుగా పేమెంట్ చేయడం ఇకపై సాధ్యపడదు. వినియోగదారులు కేవలం QR కోడ్ స్కాన్ చేయడం లేదా మొబైల్ నంబరు ద్వారా మాత్రమే చెల్లింపులు చేయగలరు. సురక్షిత లావాదేవీలకే ఈ మార్పు.
గ్యాస్ GAS ధరలు మారే తేదీ
ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి నెల మొదటిసారిగా LPG సిలిండర్ల ధరలు మారుతుంటాయి. అక్టోబరు 1న కూడా నవీకరించిన ధరలు అమలులోకి వచ్చాయి. ఈసారి మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) – ఈక్విటీ పెట్టుబడులు
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ఇప్పటివరకు 75% వరకు మాత్రమే ఈక్విటీ పెట్టుబడులకు అనుమతి ఉండగా, తాజాగా ఇది 100% వరకు పెంచే అవకాశం కల్పించారు. ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వేతర రంగాలకు చెందిన NPS సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే అక్టోబరు 1 నుంచి దైనందిన జీవనానికి సంబంధించిన అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
భద్రతా చర్యలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతికత ఆధారిత మార్పులతో పౌరులు అప్రమత్తంగా ఉండాలి. ఈ మార్పులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు.