అక్షరటుడే, న్యూఢిల్లీ: OCT 1 Market Analysis | యూఎస్, యూరోప్(Europe) మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది.
OCT 1 Market Analysis | యూఎస్ మార్కెట్లు US market..
ఎస్‌అండ్‌పీ 0.41 శాతం, నాస్‌డాక్(Nasdaq) 0.30 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.30 శాతం నష్టంతో సాగుతోంది.
OCT 1 Market Analysis | యూరోప్ మార్కెట్లు Europe market..
డీఏఎక్స్(DAX) 0.57 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.54 శాతం, సీఏసీ 0.19 శాతం లాభాలతో ముగిశాయి.
OCT 1 Market Analysis | ఆసియా మార్కెట్లు Asia Market..
బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.63 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hans Seng) 0.87 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.82 శాతం, సింగపూర్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.60 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.52 శాతం లాభంతో కొనసాగుతుండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.19 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.02 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 2,327 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిచారు. డీఐఐలు వరుసగా 26వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 5,761 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.71 నుంచి 0.91 కు పెరిగింది. విక్స్(VIX) 2.64 శాతం తగ్గి 11.07 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.21 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైస బలహీనపడి 88.78 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.15 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.85 వద్ద కొనసాగుతున్నాయి.
ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్(RBI MPC meeting) సారాంశాన్ని ఈరోజు వెల్లడించనున్నారు. వడ్డీ రేట్ల కోత విషయంలో యథాతథ స్థితిని కొనసాగించవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ కామెంటరీ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.
జీఎస్టీ సంస్కరణల అమలు తర్వాత విడుదలనున్న ఆటో సేల్స్ డాటా(Auto sales data)పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇది మార్కెట్‌కు బూస్ట్ ఇస్తుందని ఆశిస్తున్నారు.