ePaper
More
    HomeజాతీయంMumbai | ప్రయాణికుడి పొట్టలో రూ.11 కోట్ల కొకైన్​

    Mumbai | ప్రయాణికుడి పొట్టలో రూ.11 కోట్ల కొకైన్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mumbai : ముంబయి విమానాశ్రయం (Mumbai airport) లో డీఆర్ఐ​ అధికారులు భారీగా కొకైన్​ను పట్టుకున్నారు.

    కొకైన్ క్యాప్సుల్స్ ను కడుపులో ఉంచుకుని ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పొట్టలో నుంచి 1,139 గ్రాముల 67 కొకైన్​ క్యాప్సుల్స్(cocaine capsules)ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.39 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. నిందితుడిని ఐవరీకోస్ట్ జాతీయుడిగా అధికారులు గుర్తించారు.

    సియెర్రా లియోన్ (Sierra Leone) నుంచి ముంబయి (Mumbai airport) వచ్చిన సదరు ప్రయాణికుడిపై అధికారులకు అనుమానం వచ్చి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విచారణలో భాగంగా కడుపులో మాదకద్రవ్యాలతో కూడిన క్యాప్యుల్స్ ఉన్నట్లు తెలపడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాప్సుల్స్ ను స్వాధీనం చేసుకున్న నార్కొటిక్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...