ePaper
More
    HomeజాతీయంUdaipur Files Movie | ఉద‌య్‌పూర్ ఫైల్స్ చిత్రానికి తొల‌గని అడ్డంకులు.. కేంద్ర నిర్ణ‌యం కోసం...

    Udaipur Files Movie | ఉద‌య్‌పూర్ ఫైల్స్ చిత్రానికి తొల‌గని అడ్డంకులు.. కేంద్ర నిర్ణ‌యం కోసం వేచి ఉండాల‌న్న సుప్రీంకోర్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Udaipur Files Movie | టైల‌ర్ క‌న్న‌య్య లాల్(Tailor Kannaya Lal) హ‌త్యోదంతం ఆధారంగా నిర్మించిన ‘ఉదయపూర్ ఫైల్స్’ చిత్రం విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గ‌ట్లేదు. ఈ చిత్రం విడుద‌ల‌పై కేంద్ర నిర్ణ‌యం కోసం వేచి చూడాల‌ని సుప్రీంకోర్టు నిర్మాత‌ల‌కు సూచించింది.

    విజయ్ రాజ్ నటించిన ‘ఉదయపూర్ ఫైల్స్’ (Udaipur Files) చిత్రంపై దాఖ‌లైన పిటిషన్ల‌పై న్యాయ‌స్థానం బుధవారం మ‌రోసారి విచారించనుంది. కేంద్రం నిర్ణ‌యాన్ని కోరిన కోర్టు.. రాబోయే చిత్రం ‘ఉదయపూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్’ విడుదలపై విచారణను జూలై 21కి సుప్రీంకోర్టు(Supreme Court) వాయిదా వేసింది. అంతేకాకుండా, ‘ఉదయపూర్ ఫైల్స్’ చిత్రంపై అభ్యంతరాలను విచారిస్తున్న కేంద్ర కమిటీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. కన్హయ్య లాల్ హత్య కేసులో నిందితుల వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్యానెల్‌కు సూచించింది.

    Supreme Court | హ‌త్యోదంతం ఆధారంగా..

    2022లో ఉదయపూర్‌కు చెందిన దర్జీ కన్హయ్య లాల్ పట్టపగలు హత్యకు గురయ్యారు. సోష‌ల్ మీడియా (Social Media)లో వ‌చ్చిన ఓ పోస్టును రీ పోస్టు చేయ‌డ‌మే ఆయ‌న ప్రాణం మీద‌కు తీసుకొచ్చింది. ఓ వ‌ర్గానికి చెందిన కొంద‌రు క‌న్హ‌య్య‌పై దాడి చేసి దారుణంగా హ‌త‌మార్చారు. దీన్ని వీడియో కూడా తీశారు. ఈ ఉదంతం అప్ప‌ట్లో దేశాన్ని కుదిపేసింది. సంచ‌ల‌నం సృష్టించిన కన్హయ్య లాల్ సాహు హత్య కేసు ఆధారంగా ‘ఉదయపూర్ ఫైల్స్’ పేరిట క్రైమ్ డ్రామా థ్రిల్లర్ చిత్రం (Crime Drama Thriller Film) నిర్మించారు.

    అయితే, ఈ సినిమాను విడుద‌ల చేయొద్ద‌ని హ‌త్య కేసులో నిందితులు కోర్టును ఆశ్ర‌యించారు. చిత్రంలో త‌మ‌ను త‌ప్పుగా చూపించ‌డం త‌మ హ‌క్కుల‌కు భంగం క‌లిగించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. కేసు న్యాయ ప్రక్రియ పరిధిలోనే ఉన్న త‌రుణంలో సమాజంలో పక్షపాతం వ్యాపించకుండా ఉండేందుకు సినిమా విడుదలను నిలిపివేయాలని నిందితులు కోర్టును కోరారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా, కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది.

    More like this

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...