అక్షరటుడే, ఇందూరు: Election Observer | మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్‌డెస్క్ పనితీరును క్షేత్రస్థాయిలో తనిఖీ (field inspection) చేశారు.
Election Observer | నగరపాలక సంస్థ పరిధిలో..
నిజామాబాద్ నగర పాలక సంస్థ (Nizamabad Municipal Corporation) పరిధిలోని 13, 14, 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతో పాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీస్‌లను అబ్జర్వర్ పరిశీలించారు. అనంతరం బోధన్, ఆర్మూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, భీమ్‌గల్ మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును గమనించారు.
కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చ..
ఈ సందర్భంగా నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై అధికారులతో ఎన్నికల సాధారణ పరిశీలకుడు సత్యనారాయణ (Election Observer Satyanarayana) చర్చించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. టీ పోల్ యాప్‌లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ వెంట బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.