Homeజిల్లాలుకామారెడ్డిCollector Kamareddy | వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన కలెక్టర్​

Collector Kamareddy | వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన కలెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | పట్టణంతో (Kamareddy) పాటు పలు వరద బాధిత గ్రామాల్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) శుక్రవారం పర్యటించారు. వరద అనంతరం ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

వరద ముంపునకు గురైన జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో పర్యటించి ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బంది కలుగకుండా చేపట్టిన విద్యుత్ (Electricity Department)​, డ్రెయినేజీ, తాగునీటి సరఫరా, రహదారుల పునరుద్దరణ తదితర పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కామారెడ్డి పట్టణ పరిధిలోని పెద్ద చెరువును సందర్శించి వాటర్ ఫిల్టర్​ను పరిశీలించారు. పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అధిక వర్షాలతో దెబ్బతిన్న భిక్కనూరు (Bhiknoor) వాగుపై చెక్​డ్యాంను పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్​ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్​లో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.

కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి (Chinna Maallareddy) వద్ద కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిలో ఆర్అండ్​బీ రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజుల నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యల కోసం జిల్లాలో నాలుగు ఎస్డీఆర్​ఎఫ్ (SDRF)​, రెండు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.

జిల్లా కేంద్రంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీలో ప్రజలతో పాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని వేడివేడి ఆహారాన్ని, శుద్ధమైన తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ సరఫరా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు.

Must Read
Related News