OBC National Conferences
OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు

అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవాలో (Goa) ఓబీసీ జాతీయ మహాసభలు (OBC National Conferences) నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ (District BC Association President Nara Sudhakar) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) చేతుల మీదుగా మహాసభల వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం (BC Reservations) ఇవ్వాలనుకున్న రిజర్వేషన్ల బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ కేంద్రప్రభుత్వం మోకాలడ్డు వేయడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, దేవేందర్, చంద్రకాంత్, శ్రీలత, అజయ్, సాయి, సదానంద తదితరులు పాల్గొన్నారు.