అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | నగర శివారులోని ఖానాపూర్‌లో కొనసాగుతున్న కేసీపీ న్యూట్రిషన్ రైస్ మిల్లును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) బుధవారం తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టి ఫైడ్ కెన్నెల్ రైస్‌ను (Fortified kernel rice) ఉత్పత్తి చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వం ప్రతినెలా రేషన్ దుకాణాల (ration shops) ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందిస్తున్న సన్న బియ్యంలో పోషకాల కోసం ఈ ఫోర్టి ఫైడ్ రైస్‌ను కలిపి పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో తయారు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ పరిశీలించారు. మిల్లు నిర్వాహకుడు కాపర్తి శ్రావన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్నందున తగిన పరిమాణంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.