అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కంటేశ్వర్‌లోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ పోషకాహార దినోత్సవం (Nutrition Day) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆర్కిటెక్ట్, లయన్స్ క్లబ్ డైరెక్టర్ కె వెంకటేష్ (Lions Club Director K Venkatesh) హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు., ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పేద విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అబ్బాయి లింబాద్రి, పూర్వాద్యక్షుడు చింతల గంగాదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నస్వామి, ఉపాధ్యాయులు శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.