అక్షరటుడే, ఎల్లారెడ్డి: నర్సింగ్ వృత్తి (Nursing profession) సేవా నిరతికి నిదర్శనమని మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (International Nurses Day) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులను ఘనంగా సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఫోన్‌లో మాట్లాడి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
International Nurses Day | సేవకు నిదర్శనం నర్సింగ్ వృత్తి
- Advertisement -
