Homeక్రైంNizamabad City | మనోరమ ఆస్పత్రిలో నర్సు మృతి

Nizamabad City | మనోరమ ఆస్పత్రిలో నర్సు మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:Nizamabad City | జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మనోరమ ఆస్పత్రి(Manorama Hospital)లో పనిచేస్తున్న నర్సు శనివారం ఉదయం మృతి చెందింది. కామారెడ్డి జిల్లా డోంగ్లీకి చెందిన శిల్ప(27) ఏడేళ్లుగా మనోరమ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు(Emergency Ward)లో విధులు నిర్వహిస్తోంది. డ్యూటీ చేసిన అనంతరం రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పి ఉదయం 6:30కు నిద్ర లేపాలని తోటి సిబ్బందికి చెప్పింది. ఉదయం 7.30 గంటల సమయంలో ఆమెను పలకరించగా ఎలాంటి చలనం లేకపోవడంతో డాక్టర్లకు సమాచారం అందించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కూతురిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.