అక్షరటుడే, వెబ్డెస్క్ : Flights Cancelled | దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వీడటం లేదు. గాలి నాణ్యత మరింత పడిపోయింది. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో సోమవారం అనేక విమానాలు రద్దు అయ్యాయి.
ఢిల్లీ (Delhi)లో కొన్నిరోజులుగా కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో దాదాపు 170 విమానాలను (Flights) రద్దు చేశారు. అనేక ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు షెడ్యూల్ ప్రకారం గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. నగరం అంతటా పొగమంచు ఉండటంతో ఉదయం వాహనాలు నెమ్మదిగా సాగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
Flights Cancelled | ఆలస్యంగా విమానాలు
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ (Indira Gandhi Airport) ప్రతినిధి మాట్లాడుతూ, విమానాశ్రయానికి 170కి పైగా విమానాలను పిలిపించామన్నారు. నాలుగు ఇన్కమింగ్ విమానాలను రద్దు చేశామని చెప్పారు. దీని ప్రభావంతో రోజంతా వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.సోమవారం ఉదయం నగరం సగటు గాలి నాణ్యత (AQI) సూచిక 498గా నమోదు అయింది. ఇది ‘తీవ్రమైన’ వర్గంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
విజిబిలిటి తక్కువగా ఉండటంతో ఇండిగో 109 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, ఎయిర్ ఇండియా 37 విమానాలను రద్దు చేసింది. భారీగా విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.