అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కేశ వేణు (NUDA Chairman Kesha Venu) జన్మదినాన్ని మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nizamabad City | శంభునిగుడిలో అభిషేకాలు..
నగరంలోని శంభుని గుడి (Shambhuni Temple) ఛైర్మన్ బింగి మధు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శంభు లింగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు రక్తందానం చేశారు. శిబిరంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బింగి మధు, వినోద్, గాండ్ల సంతోష్, గోపురేఖ తదితరులు పాల్గొన్నారు.