140
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NUDA | ‘నగర అభివృద్ధి కమిటీ’ రూపొందించిన క్యాలెండర్ను నుడా ఛైర్మన్ కేశ వేణు (NUDA Chairman Kesha Venu) ఆవిష్కరించారు. సంస్థ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
NUDA | సూచనలు సలహాలు స్వీకరిస్తాం..
ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కేశవేణు మాట్లాడుతూ.. నగరం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి కమిటీ (City Development Committee) సభ్యులు నగరంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తామన్నారు. ముఖ్యంగా శివారు కాలనీల అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. ప్రధానంగా తాగునీటి వ్యవస్థ మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామని.. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.