Ntr
Director Trivikram srinivas | ఇలా ట‌ర్న్ తీసుకున్నాడేంటి.. మైథలాజికల్ మూవీ బ‌న్నీతో కాదు ఎన్టీఆర్‌తో..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Director Trivikram srinivas | మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ Trivikram srinivas నెక్ట్స్ ప్రాజెక్ట్‌ల‌పై అస్స‌లు క్లారిటీ రావ‌డం లేదు. రోజుకో హీరోతో త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అల్లు అర్జున్‌(Allu Arjun)తో త్రివిక్ర‌మ్ చేయాల్సి ఉండ‌గా, ఆ ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉంది. దీంతో త్రివిక్ర‌మ్ స‌ద‌రు హీరోల‌తో సినిమాలు చేయ‌బోతున్నాడ‌నే ప్ర‌చారాలు జోరుగా న‌డుస్తున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా ఇప్ప‌టికే మొద‌లు కావాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఇప్పుడు చరణ్‌(Hero Ram Charan)తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని, ఈ కథను చరణ్‌కు వినిపించి ఒప్పించారని కూడా సమాచారం.

Director Trivikram srinivas | త్రివిక్ర‌మ్ క్రేజీ ప్రాజెక్ట్స్..

తాజాగా మ‌రో కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. బ‌న్నీతో allu Arjun చేయాల్సిన మైథలాజికల్ మూవీని ఎన్టీఆర్‌(Jr. NTR)తో చేయాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ స్టోరీని ఆయనకు వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మైథలాజికల్(Mythological Movie) స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కు కూడా కరెక్ట్‌గా సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. మరి అదే నిజమైతే మరో క్రేజీ కాంబో.. ఇంట్రెస్టింగ్ మైథలాజికల్‌తో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ చిత్రానికి అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌.

గుంటూరు కారం’ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏడాదిన్నరగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పైనే దృష్టి సారించారు. బన్నీతో మూవీ అనౌన్స్‌మెంట్ వస్తుందని భావించగా దానికి బ్రేక్ పడడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్టుకు ముందే విక్టరీ వెంకటేష్‌తో ఓ మూవీ చేస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ NTR ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. చరణ్‌తో త్రివిక్రమ్ వచ్చే ఏడాది మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెంకీ, రామ్ చరణ్‌లతో మూవీ తర్వాతే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్‌లో పెడుతున్నారు త్రివిక్రమ్