HomeUncategorizedNTR-Rajamouli | ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబోలో రానున్న భారీ చిత్రం.. బ‌యోపిక్‌గా రూపొంద‌నుందా?

NTR-Rajamouli | ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబోలో రానున్న భారీ చిత్రం.. బ‌యోపిక్‌గా రూపొంద‌నుందా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: NTR-Rajamouli | సోష‌ల్ మీడియా(Social Media)లో ఇప్పుడు ఓ వార్త జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కొత్త బయోపిక్ “మేడ్ ఇన్ ఇండియా”(Made In India)లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. 2023లో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) భారతీయ సినిమాకు పితామహుడు అయిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితకథ ఆధారంగా చిత్రం తెర‌కెక్కించనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో నితిన్‌ కక్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మాక్స్‌ స్టూడియోస్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై వరుణ్‌ గుప్తా, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఈ ప్రాజెక్ట్​ను నిర్మిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

NTR-Rajamouli | గొప్ప ప్రాజెక్ట్..

తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిర్మాతలు వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి జూనియర్ ఎన్టీఆర్‌కు కథ వినిపించారని, ఆయ‌న ఫుల్ ఇంప్రెస్ అయి మూవీ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యాడ‌ని అంటున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే Dadasaheb Phalke గురించి తెలియని అనేక విషయాలు ఈ కథలో ఉన్నాయని, భారతీయ సినిమా అభివృద్ధి గురించి వివరంగా చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. మొత్తం ఆస్తులు అమ్మి డబ్బులు పోగేసి సినిమా తీయడానికి అవసరమైన పరికరాలు పుస్తకాలు కొనేవారు. లండన్ వెళ్లి ఐదు పౌండ్లతో కెమెరా కొనుక్కుని వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీశాడు.

స్నేహితుల దగ్గర తీసుకున్నది కొంత‌, తాకట్టు రూపంలో పోగేసింది కొంత‌ మొత్తం కలిపి పది వేల రూపాయలతో నిర్మాత, దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. భార్య సరస్వతి బాయ్ నగ‌లు, డ‌బ్బులు ఇచ్చింది. ఆమె ప్రోత్సాహం చాలా ఉంది. ఇంత గొప్ప మనిషి జీవితం చివరి దశలో డబ్బు లేకుండా గడిచిపోయింది. చనిపోవడానికి ఆరు సంవత్సరాల ముందు వరకు ఆయనకు సొంత‌ ఇల్లు లేదు. అంత గొప్ప ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ NTR చేస్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయం అంటున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్.. ప్ర‌శాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీని త‌ర్వాత దేవ‌ర 2 చేసే అవ‌కాశం ఉంది.