HomeసినిమాKantara Chapter 1 | నొప్పితో బాధ‌ప‌డుతూనే కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి...

Kantara Chapter 1 | నొప్పితో బాధ‌ప‌డుతూనే కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్.. ఎక్కువ సేపు నిలుచోలేక‌..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kantara Chapter 1 | పాన్ ఇండియా హిట్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రానికి హైదరాబాద్‌(Hyderabad)లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇటీవల యాడ్ షూట్‌లో గాయపడ్డ ఎన్టీఆర్‌(Jr.NTR)కు డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి సూచించారు. అయినప్పటికీ రిషబ్ శెట్టి(Rishab Shetty) కోసం ఈవెంట్‌కు హాజరయ్యారు. స్టేజ్‌పై స్పీచ్ మొదలు పెట్టే ముందు “కొంచెం నొప్పిగా ఉంది. గట్టిగా మాట్లాడలేను. మీరు సైలెంట్‌గా ఉంటే మాట్లాడుతాను. అర్థం చేసుకోండి” అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పడం ఆయన డెడికేషన్‌ని చూపించింది.

Kantara Chapter 1 | ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న తారక్. “నా వయసు నాలుగేళ్లప్పుడు మా అమ్మమ్మ కూర్చోబెట్టుకుని మా ఊరైన కుందపురా దగ్గర కథలు చెప్పేది. అప్పట్లో అర్థం కాలేదు కానీ ఆ కథలు బాగుండేవి. గుళిగా ఆట, పింజర్లి లాంటివి చూడాలని అనుకునేవాడిని. ఆ కథల మీద సినిమా తీస్తారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా బ్రదర్ రిషబ్ శెట్టి తీశాడు” అని అన్నారు. అలాగే, మా అమ్మకు ఎప్పట్నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణ టెంపుల్‌కి వెళ్లాలని. రిషబ్ గారివల్లే అది సాధ్యమైంది. గుళ్లకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించి మా సొంత బ్రదర్‌లా చూసుకున్నారు.

అందుకు థ్యాంక్యూ రిషబ్. కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1) తీయడం ఈజీ కాదు. ఆయన కష్టానికి ఫలితం అందించండి. ఇంకొంచెం మాట్లాడాలనుకున్నా, ఎక్కువ సేపు నిల్చోలేకపోతున్నాను అని స్పీచ్ ముగించారు. తారక్ చెప్పిన ప్రతి మాటకు అభిమానులు సూప‌ర్భ్‌గా స్పందించారు. రిషబ్ శెట్టి పట్ల ఆయన చూపిన బ్రదర్ బాండింగ్, తల్లిని గుర్తు చేసుకుంటూ చెప్పిన భావోద్వేగ క్షణాలు వేడుకలో హైలైట్‌గా నిలిచాయి. కాంతార చాప్టర్ 1 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ఆశీస్సులు, ఆయన ఎమోషనల్ కనెక్ట్‌తో ఈ సినిమాకి మరింత హైప్ అందుకుంది.

Must Read
Related News