అక్షరటుడే, వెబ్డెస్క్ :Jr.NTR | ఆకర్షణీయంగా ఉంటూ ఎప్పుడూ ప్రజలను ఆకట్టుకునే కళారంగంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్(jr NTR).
ఆర్ఆర్ఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హృతిక్ రోషన్ Hritik Roshanతో కలిసి వార్ 2అనే మల్టీస్టారర్ చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన వార్2ను విడుదల చేయనున్నారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానరు(Yash Raj Films banner)పై భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఎన్టీఆర్.. టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటుడు, డాన్సర్. చిన్నప్పుడే భరతనాట్యంలో శిక్షణ పొందిన ఎన్టీఆర్ నాట్యప్రదర్శనలు కూడా చేశారు.
Jr.NTR | ఎన్టీఆర్ రేర్ ఫీట్..
టాలీవుడ్ వరకే కాదు.. ఇండియన్ సినిమా బెస్ట్ డాన్సర్స్‌లో ఒకడిగా ఎన్టీఆర్ NTR మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. చిన్నవయసు నుండే డాన్స్ మీద ఆసక్తిితో తల్లి శాలిని ప్రోత్సాహంతో నృత్యకళలో శిక్షణ తీసుకున్న ఎన్టీఆర్.. నటుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry)లో అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం. బాలనటుడుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాక టీనేజ్ లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం 23 మే 2021లో విడుదలైంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సినీ పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టి 25 ఏళ్లు అయింది. అయితే ఎన్టీఆర్ నటించిన బాలరామాయణం సినిమా వచ్చి 25 ఏళ్ళు కావడంతో ఎన్టీఆర్ కూడా అరంగేట్రం చేసి 25 ఏళ్ళు అవుతోందని సినీబృందం అప్పట్లో ఒక పోస్టర్ వదిలారు.
ఎన్టీఆర్ బాలనటుడుగా బాలరామాయణం(1996) Bala RAmayanam సినిమాతో మొదటిసారి వెండితెరపై అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. భారీ సెట్స్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ బాలరామాయణం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే బాలరామాయణం సినిమాకు ముందే ఎన్టీఆర్ వేరే సినిమాలలో మెరిసాడట. కానీ ప్రేక్షకులు గుర్తించింది మాత్రం బాలరామాయణం సినిమాతోనే.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2(War 2)తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(Dragon movie) సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమాలో కేవలం రెండు పాటలే ఉండటం విశేషం. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నారు.