117
అక్షరటుడే, ఆర్మూర్: Armoor rtc | ఆర్మూర్ ఆర్టీసీ అధికారుల తీరుకు నిరసనగా పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. తమ కాలనీకి కనీసం రోడ్డు వదలకుండా ఆర్టీసీ అధికారులు గోడ కట్టేస్తున్నారని నిరసన తెలుపుతూ వారు కాలనీవాసులంతా టెంట్ వేసుకుని ధర్నాకు దిగారు.
Armoor rtc | వినయ్‌రెడ్డి హామీ..
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి (in-charge Vinay Reddy) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ సొసైటీ ఛైర్మన్ అశోక్, పండిత్ పవన్, విజయ్ అగర్వాల్, భూపేందర్, తదితరులు పాల్గొన్నారు.